E-PAPER

గూడెంలో మొదలైన బతుకమ్మ సంబురాలు

ప్రతిక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం
9587247365
bhadradritimes.in
Date of Publish : 11 October 2026, 8:09 am Posted by : BHADRADRITIMES

గూడెంలో మొదలైన బతుకమ్మ సంబురాలు

ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ శోభ.. పూలతో కళకళలాడిన వాడలు

కొత్తగూడెం, (భద్రాద్రి టైమ్స్) తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు రామవరంలో ప్రారంభమయ్యాయి. శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో తొలిరోజు వేడుకలు మొదలుకావడంతో ప్రాంతంలో పండుగ సందడి నెలకొంది. తెలంగాణ ఆడపడుచులు ప్రకృతిలో లభించే వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, గౌరీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర పూలతో అలంకరించిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ చేరి, జానపద పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. పూల పండుగతో జిల్లా కేంద్రం కొత్తగూడెంలో పరిసరాలు సందడిగా మారాయి. తెలంగాణ అస్తిత్వానికి, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఏడాది తొమ్మిది రోజుల పాటు భక్తి, ఆనందోత్సాహాల మధ్య నిర్వహిస్తారు. ప్రకృతిని ఆరాధిస్తూ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఇరుగుపొరుగు వారితో కలిసి జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రజల ఐక్యతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ సంబురాలు రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా కొనసాగనున్నాయి. చివరి రోజైన సద్దుల బతుకమ్మతో పూల పండుగ ముగియనుంది.

Generating image…

Bhadradritimes Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!