నూకల రంగారావుకు పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు
పాత పదవినే ఇచ్చి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ పార్టీ
భద్రాద్రి టైమ్స్, పాల్వంచ: పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నూకల రంగారావును మరోసారి నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సెప్టెంబర్ 17న ఉత్తర్వులు జారీ చేశారు. NSUI, యువజన విభాగాల నుంచి కాంగ్రెస్‌లో పనిచేస్తూ సుమారు నాలుగు దశాబ్దాలుగా పార్టీతో కొనసాగుతున్న నూకల రంగారావుకు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ స్థాయి పదవి వస్తుందని, పొంగులేటి ముఖ్య అనుచరుడిగా ఉన్న నూకల కు గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మరోసారి పట్టణ అధ్యక్షుడిగా మాత్రమే బాధ్యతలు అప్పగించడంపై స్థానిక కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
“40 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న సీనియర్ నాయకుడికి నామినేటెడ్ పదవో లేక జిల్లా స్థాయి బాధ్యతో కల్పించాల్సింది కాదా?” అని ఆయన మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు.
కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి కూడా అవకాశాలు లభిస్తున్న సమయంలో, సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేసిన నాయకుల సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా పట్టణ అధ్యక్ష బాధ్యతతోనే కాక ఆయన స్థాయికి తగిన పదవి ఇస్తారా? లేక ఇదే పదవితో సరిపెడతారా? అన్నది కాంగ్రెస్ నాయకత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.
— భద్రాద్రి టైమ్స్ | రాజకీయ నాడి








