పాల్వంచలో నుంచి AISTA సీనియర్ టెన్నిస్ పోటీలు
భద్రాద్రి టైమ్స్, పాల్వంచ: ఆల్ ఇండియా సీనియర్స్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ టెన్నిస్ పోటీలు పాల్వంచలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీవో రాహుల్, మేయర్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, శ్యామల గోపాలన్ ఫౌండేషన్ చైర్మన్ సురేష్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, ఏఐఎస్‌టీఏ కార్యదర్శి రాంబాబు, టెన్నిస్ అకాడమీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సీనియర్ టెన్నిస్ క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమానికి పాల్వంచ వేదిక కావడం స్థానిక క్రీడాభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
టోర్నమెంట్‌కు సహకారం
క్రీడలు, క్రీడాకారుల ప్రోత్సాహానికి శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్ నల్ల సురేష్ రెడ్డి అందిస్తున్న సహకారాన్ని నిర్వాహకులు అభినందించారు.








