E-PAPER

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌

ప్రతిక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం
9587247365
bhadradritimes.in
Date of Publish : 20 September 2026, 1:49 am Posted by : BHADRADRITIMES

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌

130 మేనేజర్ పోస్టులకు TGPSC నోటిఫికేషన్
₹54,220 నుంచి ₹1,33,630 వరకు వేతనం
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (భద్రాద్రి టైమ్స్): ఇంజినీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) శుభవార్త అందించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డులో మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి 130 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ అర్హతగా పేర్కొంది. మొత్తం పోస్టుల్లో 80 శాతం సివిల్ ఇంజినీరింగ్, 15 శాతం ఎలక్ట్రికల్/మెకానికల్, 5 శాతం CSE/IT/ECE విభాగాల అభ్యర్థులకు కేటాయించినట్లు వెబ్‌నోట్‌లో పేర్కొన్నారు.
వయోపరిమితి: 01-07-2026 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ₹54,220 నుంచి ₹1,33,630 వరకు వేతన స్కేల్ లభించనుంది.
సెప్టెంబర్ 23 నుంచి దరఖాస్తులు
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 23-09-2026 నుంచి ప్రారంభమై 17-10-2026 వరకు కొనసాగనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, ఇతర నిబంధనలను పూర్తి నోటిఫికేషన్‌లో పరిశీలించి అధికారిక TGPSC వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈ నోటిఫికేషన్‌ ద్వారా మంచి ఉద్యోగావకాశం లభించనుంది.
— భద్రాద్రి టైమ్స్ | కెరీర్ దిక్సూచి

Generating image…

Bhadradritimes Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!