E-PAPER

తెలంగాణలో కాంగ్రెస్ సీఎం ఎవరు – డీకే శివకుమార్ క్లారిటీ..!!

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

తెలంగాణలో కాంగ్రెస్ సీఎం ఎవరు – డీకే శివకుమార్ క్లారిటీ..!!

25 Nov 2023, 5:22 pm MANASAKSHIGONTHUKA

తెలంగాణలో ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరింది. ప్రధాన పార్టీలకోసం అగ్ర నాయకత్వం రంగంలోకి దిగింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య పోటీ కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి ఖాయమనే ప్రచారం సాగుతున్న వేళ సీఎం ఎవరనే చర్చ మొదలైంది. డిసెంబర్ 9న కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని రేవంత్ చెబుతున్నారు. ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్ది గురించి డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు.

కర్ణాటకలో అమలు చేస్తున్నాం : కర్ణాటకలో పాలన సెక్రటేరియట్ నుంచి నడుస్తోందని.. తెలంగాణలో మాత్రం పాలన ఫామ్ హౌజ్ నుంచి నడుస్తోందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. హైదరాబాద్, బెంగుళూరు దేశానికి కవలపిల్లలని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను కొనడంలో కేసీఆర్ ఎక్స్‌పర్ట్ అన్నారు. గత రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారన్నారు.

DK Shiva Kumar Interesting comments on becoming Chief Minister from Congress in Telangana

వేరే పార్టీలు ఎమోషన్స్‌తో పాలిటిక్స్ చేస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రజల జీవితాలను దృష్ఠిలో పెట్టుకొని రాజకీయాలు చేస్తాయన్నారు. తెలంగాణ విషయంలో కర్ణాటక హృదయంతో ఆలోచిస్తోందని డీకే శివకుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వస్తే.. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంపైనా డీకే శివకుమార్ స్పందించారు.

అధికారం ఖాయం : కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని చెప్పిన డీకే శివకుమార్.. సీఎం ఎవరనే విషయంలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పారు. చంద్రబాబు, వైఎస్సార్ హైదరాబాద్ అభివృద్ధి కోసం పాటుపడ్డారని గుర్తు చేసారు. రాష్ట్రం ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని మాట తప్పారన్నారు. కర్ణాటక రైతులకు మేం ఉచిత కరెంట్ ఇవ్వడం ప్రారంభించామని చెప్పారు.

తెలంగాణతో పోల్చితే.. కర్ణాటక పెద్ద రాష్ట్రమని వివరించారు. కరెంట్ విషయంలో తెలంగాణ కంటే మేం మెరుగ్గా ఉన్నామని చెప్పుకొచ్చారు. కర్ణాటక ప్రజలకు 5 గ్యారెంటీలు అమలు అవుతున్నాయని స్పష్టం చేసారు. కాంగ్రెస్ పార్టీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఉందన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా పథకాలు ఉంటాయని శివకుమార్ వివరించారు.

హోరెత్తుతున్న ప్రచారం : కేసీఆర్, కేటీఆర్ కర్ణాటక వచ్చి అక్కడ అమలవుతున్న పథకాల గురించి తెలుసుకోవాలని కోరారు. ఇక, మరో మూడు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. బీజేపీ అభ్యర్దుల కోసం ప్రధాని మోదీ, అమిత్ షా, యూపీ సీఎం యోగీ, రాజ్ నాధ్ సింగ్ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంకతో పాటుగా ఏఐసీసీ నేతలు తెలంగాణలో మకాం వేసారు. తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. దీంతో..హోరా హోరీగా సాగుతున్న తెలంగాణ ఎన్నికల్లో తుది ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Generating image…

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!