E-PAPER

మానవత్వం చాటిన నాగిరెడ్డిపల్లి గ్రామం.. పేదింటి పెళ్లికి పెద్ద మనసుతో చేయూత..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

మానవత్వం చాటిన నాగిరెడ్డిపల్లి గ్రామం.. పేదింటి పెళ్లికి పెద్ద మనసుతో చేయూత..

05 Sep 2026, 8:25 am MANASAKSHIGONTHUKA

మానవత్వం చాటిన నాగిరెడ్డిపల్లి గ్రామం..

పేదింటి పెళ్లికి పెద్ద మనసుతో చేయూత..

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన నాగిరెడ్డిపల్లి గ్రామం

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట, సెప్టెంబర్ 5: పేదింటి ఆడబిడ్డ వివాహానికి గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం గురుజకుంట బిక్షపతి కుమార్తె వివాహం సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి నూతన వధూవరులకు అవసరమైన పెళ్లి సామగ్రిని అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ తాతిరెడ్డి భవాని శశిధర్ రెడ్డి పేదింటి ఆడబిడ్డ వివాహానికి పుస్తె మట్టెలు అందజేశారు. గ్రామ సర్పంచ్ బంగారు రవి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ చేట్కూరి రాజు, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కుక్కల బాలకిషన్, తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి, కంసాని ఎల్లారెడ్డి, వార్డు సభ్యులు వెల్దండ రవి, వెల్దండ కొండయ్య, ఎండి మైమూద్ తదితరులు కలిసి నూతన వధూవరులకు వివాహానికి అవసరమైన సామగ్రిని బహుమతిగా అందించారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో ఏ కుటుంబం కూడా తమ కుమార్తె వివాహాన్ని భారంగా భావించకూడదనే ఉద్దేశంతో తమ వంతు సహాయం అందించినట్లు తెలిపారు. గ్రామంలో అవసరమైన వారికి అందరూ ఐక్యంగా అండగా నిలవాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Generating image…

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!