మన సాక్షి గొంతుక బచ్చన్నపేట, సెప్టెంబర్ 9:జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని లక్ష్మాపూర్ సబ్‌స్టేషన్పరిధిలో కొప్పురపు విజయ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఎస్‌హెచ్ సంపత్ రెడ్డి మంగళవారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభంతో లక్ష్మాపూర్‌తో పాటు పరిసర గ్రామాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయానికి పగటి పూట నాణ్యమైన విద్యుత్ అందించడం ద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా విద్యుత్ కొరతను అధిగమించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని అధికారులు తెలిపారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్‌లో విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా తీర్చుకోవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొప్పురపు శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్ శాఖ డీఈ జనగాం లక్ష్మీనారాయణ రెడ్డి, ఎంఆర్‌టీ డీఈ విజయ్ కుమార్, ఏడీఈ వేణుగోపాల్, భద్రయ్య, బచ్చన్నపేట ఏఈ రాజకుమార్, లైన్మెన్ శ్రీనివాస్ రెడ్డి, జూనియర్ లైన్మెన్ పరుశురాములు, హెల్పర్ ఆంజనేయులు, ఇజ్జగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.









