ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు
మన సాక్షి గొంతుక ప్రతినిధి
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బచ్చన్నపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురు యువకులు, నాయకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.అనంతరం ఎమ్మెల్యే జన్మదిన కేక్‌ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే నిరుపేదలు, ప్రయాణికులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి, సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడుగంగం సతీష్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి పిరోజ్, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, సీనియర్ నాయకులు ఈదులకంటి ప్రతాపరెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పులిగిల్ల పూర్ణచందర్,వడ్డేపల్లి మల్లారెడ్డి, కొండి వెంకటరెడ్డి, మల్లవరం వెంకటేశ్వరరెడ్డి,కనకయ్య గౌడ్,అల్వాల ఎల్లయ్య,మండల సర్పంచులు మద్దికుంట రాధ, స్వర్ణలతశివకుమార్, కళ్యాణి పరశురాములు, రవికుమార్, ఆజాం, కల్పన రాజిరెడ్డి, జిల్లెల భాస్కర్ రెడ్డి, చంద్రకళ స్వామి, ఉపసర్పంచ్ బైరి రజిత వెంకటేష్, ఎండి జావిద్, వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి, చింతపండు బాలకృష్ణ, అజీమ్, సిద్ధారెడ్డి, చందు, సోషల్ మీడియా కరుణాకర్ రెడ్డి, గోపిరెడ్డి, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువజన నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..










