E-PAPER

మండలనూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి మసూద్‌కు ఘన సన్మానం చేసిన నిమ్మ కరుణాకర్ రెడ్డి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

మండలనూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి మసూద్‌కు ఘన సన్మానం చేసిన నిమ్మ కరుణాకర్ రెడ్డి

11 Jul 2026, 3:48 pm MANASAKSHIGONTHUKA

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట: బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఎండి మసూద్‌ను చిన్నరామచర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడు నిమ్మ కరుణాకర్ రెడ్డి మాజీ సర్పంచ్ బాపురెడ్డి తో కలిసి మర్యాదపూర్వకంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎండి మసూద్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.అనంతరం ఎండి మసూద్ మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మండలంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని నూతన మండల అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు.మండల నాయకులు, స్టేట్ కిసాన్ కోఆర్డినేటర్ నిడిగొండ శ్రీనివాస్, కట్కూరు సర్పంచ్ బల్ల రవీందర్, గిద్దెల రమేష్, బైరి వెంకటయ్య, బొట్టు గణపతి,కోక్కలకొండ బాబు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!