మన సాక్షి గొంతుక బచ్చన్నపేట, జూలై 11: జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బచ్చన్నపేట మండల కేంద్రంలోని అతిథి గృహంలో భారత రాష్ట్ర సమితి మండల పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని మొత్తం 58 మంది రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఇర్రి రమణరెడ్డి, బోడిగం చంద్రారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్‌రెడ్డి, వేముల లక్ష్మణ్ గౌడ్, కానుగంటి బాలచందర్, వడ్డేపల్లి మల్లారెడ్డి, పులిగిల్ల పూర్ణచందర్,మల్లవరం వెంకటేశ్వర రెడ్డి, సర్పంచ్ మద్దికుంట రాధ, కొండి వెంకటరెడ్డి, ఉపసర్పంచ్ బైరు రజిత వెంకటేష్, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










