మన సాక్షి గొంతుక బచ్చన్నపేట, జూలై 11: జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బచ్చన్నపేటలో వార్డు సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు భోజనాలు వడ్డించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రజలకు మరింత సేవలందిస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట ఉపసర్పంచ్ బైరు రజిత వెంకటేష్, వార్డు సభ్యులు శివరాత్రి రాజు, దేవరకొండ మల్లేష్, గర్నపెల్లి అంజయ్య, దిడ్డిగా చంద్రమ్మ, కర్రె బాస్కర్, కక్కెర్ల విజయలక్ష్మి, కక్కెర్ల ఉమారాణి, విజయ్, శీను, తౌటి భవాని, గంధ మల్ల మాదేవి, ముద్దసాని నవ్య. మండల నాయకులు సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి, ఈర్రి రమణారెడ్డి, బోడిగం చంద్రారెడ్డి,ఈదులకంటి ప్రతాపరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి, మాజీ సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, కొండి వెంకటరెడ్డి, మల్లవరం వెంకటేశ్వర్ రెడ్డి,మూసిని రాజు, కనకయ్య గౌడ్, ఎండి జావిద్, షబ్బీర్, మచ్చ సతీష్, సురేష్, నర్సింగ శివకుమార్, కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










