E-PAPER

కాంగ్రెస్‌లో విభేదాలకు చెక్.. ఐక్యంగా మండల నాయకత్వం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

కాంగ్రెస్‌లో విభేదాలకు చెక్.. ఐక్యంగా మండల నాయకత్వం

12 Jul 2026, 5:07 pm MANASAKSHIGONTHUKA

కాంగ్రెస్‌లో విభేదాలకు చెక్.. ఐక్యంగా మండల నాయకత్వం

మండల అధ్యక్షుడు ఎండి మసూద్ ను సన్మానించిన మండల నాయకులు

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం జూలై 12:బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలకు తెరపడింది. ఇటీవల మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎండి మసూద్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పార్టీ నాయకులు ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. పార్టీ బలోపేతమే తమ ప్రధాన లక్ష్యమని, వ్యక్తిగత పదవుల కంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ముఖ్యమని నాయకులు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జంగిటి విద్యానాథ్, జిల్లా నాయకుడు జిల్లా సందీప్ కలిసి మండల అధ్యక్షుడు ఎండి మసూద్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గం ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి, డిసిసి అధ్యక్షురాలు లకావత్ ధన్వాంతి లక్ష్మీనారాయణ, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు అందరూ సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.మండల అధ్యక్షుడు ఎండి మసూద్ మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కార్యకర్తలందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్, జిల్లా కార్యదర్శులు దాత్రపు నరేష్, నక్కవానీ గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు కన్రాజ్ రవీందర్, మాజీ సర్పంచ్ గిద్దల రమేష్, జ్యోతి భాస్కర్, గుర్రపు బాలరాజు, చల్లా సంతోష్ రెడ్డి, నీల రమేష్, దిడిగా రమేష్, కర్ణాకర్ రెడ్డి, మల్లయ్య, దాచేపల్లి నర్సింగరావు, కొండ హరికృష్ణ, గని గౌడ్ ,అఖిల్ మాల,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!