E-PAPER

వర్షాలు కురిపించు శివుడా.. ముస్లిం సర్పంచ్ శివలింగానికి నీలాభిషేకం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

వర్షాలు కురిపించు శివుడా.. ముస్లిం సర్పంచ్ శివలింగానికి నీలాభిషేకం

13 Jul 2026, 4:32 pm MANASAKSHIGONTHUKA

వర్షాలు కురిపించు శివుడా.. ముస్లిం సర్పంచ్ పరమేశ్వరుడి శివలింగానికి నీలాభిషేకం

బచ్చన్నపేట, జూలై 13 (మన సాక్షి గొంతుక):జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని చిన్నరామచర్ల గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ గ్రామ సర్పంచ్ ఎండి అజాం ఆధ్వర్యంలో శ్రీ శివాలయంలో ప్రత్యేక నీలాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ మహిళలు బిందెలలో నీటిని తీసుకువచ్చి శివలింగానికి నీలాభిషేకం చేసి, పంటలు బాగా పండాలని, చెరువులు, కుంటలు నిండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి వర్షాలు కురవాలని పరమేశ్వరుడిని ప్రార్థించారు.మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సర్పంచ్ ఎండి అజాం ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం గ్రామస్తుల ప్రశంసలు అందుకుంది. గ్రామంలో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని చాటేలా ఈ కార్యక్రమం సాగిందని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generating image…

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!