E-PAPER

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు….

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు….

16 Jul 2026, 2:49 pm MANASAKSHIGONTHUKA

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు....

బెల్ట్ షాపులు వెంటనే మూసివేయాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు వినతి

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట, జూలై 16: బచ్చన్నపేట మండలంలోని గ్రామాల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు పుట్టుకొస్తుండటంతో అక్రమ మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని సర్పంచ్‌ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని అన్ని అక్రమ బెల్ట్ షాపులను వెంటనే మూసివేసి, కల్తీ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు పెరిగిపోవడంతో కల్తీ మద్యం సులభంగా అందుబాటులోకి వస్తోందన్నారు. నాణ్యత లేని మద్యం సేవించడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవడంతో పాటు ప్రాణాపాయ పరిస్థితులు కూడా తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.మద్యం వ్యసనం కారణంగా కుటుంబాల్లో కలహాలు పెరిగి, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రోజువారీ కూలీలు, పేద కుటుంబాలకు చెందిన వారు తమ సంపాదనలో అధిక భాగాన్ని మద్యం కోసం ఖర్చు చేయడంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందన్నారు. దీంతో ప్రజలు ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థికంగానూ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.మండలంలోని అన్ని అక్రమ బెల్ట్ షాపులను గుర్తించి వెంటనే మూసివేయాలని, నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామాల్లో నిరంతర తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా అరికట్టాలని ఎక్సైజ్ శాఖను కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దూడల కనకయ్య, ముసిని రాజు గౌడ్, మహమ్మద్ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు

Generating image…

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!