బీఎల్ఏలకు గంగం సతీష్ రెడ్డి, చల్ల శ్రీనివాసరెడ్డి పిలుపు…
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ప్రతి బీఎల్ఏ సవాల్‌గా స్వీకరించి పని చేయాలని సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షుడు చల్ల శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. అవసరమైతే ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవసరమైన ఫారాలను నింపించి అందించాలని, ఎవరూ ఓటరు జాబితాలో పేరు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు కూడా బీఎల్ఏల సేవలను సద్వినియోగం చేసుకుని తమ ఓటరు వివరాలను సరిచూసుకోవాలని, అవసరమైన దరఖాస్తులను సకాలంలో సమర్పించాలని ఆయన కోరారు.ఈ మేరకు సాల్వపూర్, లింగంపల్లి, మన్సాన్‌పల్లి, పడమటి కేశవపూర్ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియ, ఫారాల వినియోగం, ఓటరు నమోదు, మార్పులు, చేర్పులపై వివరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు శ్రీధర్ గౌడ్, మద్దికుంట రాధ ,మండల నాయకులు ఈదులకంటి ప్రతాపరెడ్డి, కనకయ్య గౌడ్, మూసిని రాజు, షబ్బీర్, గ్రామ శాఖ అధ్యక్షులు,బీఎల్ఏలు, పార్టీ నాయకులు, గ్రామస్థులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.










