E-PAPER

రాహుల్ గాంధీపై దాడిని ఖండించిన బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగిటి విద్యానాథ్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

రాహుల్ గాంధీపై దాడిని ఖండించిన బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగిటి విద్యానాథ్

22 Jul 2026, 4:05 pm MANASAKSHIGONTHUKA

బచ్చన్నపేట, జూలై 22 (మన సాక్షి గొంతుక):ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై నిర్వహించిన నిరసన కార్యక్రమం సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గాయపడిన ఘటనను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగిటి విద్యానాథ్ తీవ్రంగా ఖండించారు.మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఘటనపై తన నిరసనను వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా జంగిటి విద్యానాథ్ మాట్లాడుతూ, దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీపై దాడి జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుల గొంతును అణచివేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ పేపర్ లీకేజీ వంటి కీలక అంశంపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమయంలో జరిగిన ఈ ఘటనను ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించాలని జంగిటి విద్యానాథ్ డిమాండ్ చేశారు.

Generating image…

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!