ఒకే పంపుతో నీటి తరలింపు వల్ల రైతులు నష్టపోతున్నారు – ఇర్రి రమణారెడ్డి
సెకండ్, థర్డ్ ఫేజ్‌ల నుంచి నాలుగు మోటర్ల ద్వారా నీటిని తరలించి చెరువులు నింపాలి
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట, జూలై 25: ధర్మసాగర్ నుంచి గండిరామారం, బొమ్మకూర్, కన్నెబోయిన గూడెం మీదుగా తపాస్పల్లి వరకు ప్రస్తుతం ఒకే పంపు ద్వారా నీటిని తరలించడం వల్ల బచ్చన్నపేట మండల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి అన్నారు.శనివారం ఆయన గండిరామారం, బొమ్మకూర్, కన్నబోయిన గూడెం డ్యాములను సందర్శించి నీటి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అమలులో ఉన్న నీటి సరఫరా విధానం వల్ల సాగునీరు సకాలంలో అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్‌ల నుంచి నాలుగు మోటర్ల సహాయంతో నీటిని ఎత్తిపోసి గండిరామారం, బొమ్మకూర్, కన్నెబోయిన గూడెం, తపాస్పల్లి డ్యాములను పూర్తిస్థాయిలో నింపాలని డిమాండ్ చేశారు. అనంతరం అక్కడి నుంచి బచ్చన్నపేట మండలంలోని చెరువులకు నీటిని విడుదల చేసి రైతులకు సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు.రైతులపై పక్షపాత ధోరణిని ప్రభుత్వం విడనాడాలని, వ్యవసాయాన్ని కాపాడే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మండలంలోని చెరువులను నింపి రైతులకు సాగునీరు అందించేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఇర్రి రమణారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, హరి ప్రసాద్ ,సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు










