E-PAPER

అంగన్వాడి విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేసిన సర్పంచ్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

అంగన్వాడి విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేసిన సర్పంచ్

08 Aug 2026, 5:51 pm MANASAKSHIGONTHUKA

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా నక్కవానిగూడెం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు యూనిఫామ్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పోతుల వెంకటేశ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై అంగన్వాడి చిన్నారులకు యూనిఫామ్‌లను అందజేశారు.అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ చిన్నారుల ప్రాథమిక విద్యకు అంగన్వాడి కేంద్రాలు ఎంతో కీలకమని అన్నారు. చిన్న వయస్సు నుంచే విద్యపై ఆసక్తి పెంపొందించడంతో పాటు, ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను తల్లులకు వివరించారు. శిశువులకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమని, పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా చిన్నారులకు అందుతున్న సేవలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి, ఆశా కార్యకర్తలు కన్రాజ్ నాగమణి, బొట్టు భాగ్య, చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు యూనిఫామ్‌లు అందజేయడంతో పాటు, వారి ఉత్సాహాన్ని పెంచేలా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.

Generating image…

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!