ముత్యంపేట 3వ అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు
మల్యాల, ఆగస్టు, 08(మన సాక్షి )మల్యాల మండలం ముత్యంపేటలోని 3వ అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తల్లులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పుట్టిన శిశువుకు 0 నుండి 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, తల్లిపాలలో వ్యాధినిరోధక శక్తి ఉంటుందని వివరించారు. ముర్రుపాల ప్రాముఖ్యతను, అలాగే గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన పోషకాహారం గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ తాళ్ల శోభారాణి, వార్డు మెంబెర్ లావణ్య, ఆశా కార్యకర్త బాబాయి, ఆయా జలతో పాటు గర్భిణీలు, బాలింతలు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.
Post Views: 13










