మన సాక్షి గొంతుక బచ్చన్నపేట:దేవాదుల కాలువను ధ్వంసం చేసి రైతుల సాగునీటికి ఆటంకం కలిగించిన దుండగులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం బచ్చన్నపేట చౌరస్తాలో మహాధర్నా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వందలాది మంది రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మండల సర్పంచ్ ఫోరం మాజీ అధ్యక్షుడు గంగం సతీష్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల జీవనాధారమైన దేవాదుల కాలువను ధ్వంసం చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలువ ధ్వంసంతో సాగునీటికి తీవ్ర అంతరాయం ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడి దేవాదుల కాలువకు తక్షణమే మరమ్మతులుచేపట్టిరైతులపంటలకుసాగునీరుఅందించాలనికోరారు.ఈకార్యక్రమంలోసర్పంచ్లఫోరంఅధ్యక్షుడుఫిరోజ్,మద్దికుంటరాధ,పోతులవెంకటేష్,కోడూరుశివకుమార్,నీలమురళి,పేరబోయినపరశురాములు, నూకల రాజిరెడ్డి, జిల్లెల్ల భాస్కర్ రెడ్డి, ,ఎండి ఆజాం, నాయకులు ఈదులకంటి ప్రతాప్ రెడ్డి,కొండి వెంకటరెడ్డి, అల్వాల ఎల్లయ్య, సిద్ధారెడ్డి, బైరి వెంకటేష్, చింతల కర్ణాకర్, పిడుగుమహేష్ ,మహేష్, వినయ్, షబ్బీర్ ,కరుణాకర్ రెడ్డి, చింతల వెంకటయ్య, అచ్చయ్య, ఇతరులు పాల్గొన్నారు.










