పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ.. కళ్యాణ మహోత్సవం…
భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు గ్రామంలో ఏర్పాట్లు
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం : మండలంలోని, తమ్మడపల్లి గ్రామంలో కుల పెద్దమనిషి ఉపసర్పంచ్ గొలనుకొండ నాగరాజు, కుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ, కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. సెప్టెంబర్ 2న ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక వేడుకలు గ్రామంలో భక్తిశ్రద్ధలతో కొనసాగనున్నాయి.
మహోత్సవంలో భాగంగా తొలిరోజు మాతమ్మ బోనాలు, పోచమ్మ తల్లి విగ్రహ ఊరేగింపు, జలభిషేకం, విగ్రహ ప్రతిష్ఠ, పట్నాలు, పోచమ్మ బోనాలు తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. గ్రామంలోని మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనిఅమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం పోచమ్మ తల్లి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు.రెండో రోజు పోచమ్మ దశపతి కళ్యాణ మహోత్సవంనిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అమ్మవారి కల్యాణోత్సవం తదితర కార్యక్రమాలు భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించనున్నారు. గ్రామ ప్రజలందరూ ఈ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ, కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు పెద్దలు, యువత, భక్తులు, నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెజాడి సిద్ధులు, కుల పెద్దమనిషి ఉపసర్పంచ్ గొలనుకొండ నాగరాజు, దాసరి శ్రీనివాస్ రెడ్డి, మల్లయ్య, కొమురయ్య, జరిపోతుల నరసయ్య, మోత్కు పరిచయ, సిద్ధయ్య, కిష్టయ్య, స్వామి, మూర్తి, ప్రభాకర్, నాగయ్య తదితరులు పాల్గొని ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.










