E-PAPER

కార్యకర్తలు మెచ్చిన నాయకుడు.. రెండోసారి అధ్యక్షుడిగా  బోదాసు స్వామి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

కార్యకర్తలు మెచ్చిన నాయకుడు.. రెండోసారి అధ్యక్షుడిగా  బోదాసు స్వామి

24 Aug 2026, 4:52 pm MANASAKSHIGONTHUKA

కార్యకర్తలు మెచ్చిన నాయకుడు.. రెండోసారి అధ్యక్షుడిగా  బోదాసు స్వామి

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం, బోనకొల్లూరు గ్రామ శాఖ అధ్యక్షుడిగా బోదాసు స్వామి వరుసగా రెండోసారి ఎంపికయ్యారు. పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయిలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన స్వామిపై కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి మసూద్ ఆధ్వర్యంలో మండల నాయకులు, సర్పంచ్ చిక్కుడు కల్పన కృష్ణ పాల్గొని నూతన కమిటీని ఎన్నుకున్నారు.ఈ నేపథ్యంలో మరోసారి గ్రామ శాఖ అధ్యక్ష బాధ్యతలను ఆయనకే అప్పగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. రెండోసారి అధ్యక్షుడిగా అవకాశం దక్కడంతో కార్యకర్తలు, పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి బోదాసు స్వామి కృతజ్ఞతలు తెలిపారు.రానున్న రోజుల్లో పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు మరోసారి అధ్యక్ష బాధ్యతలు దక్కడం తనపై మరింత బాధ్యతను పెంచిందని బోదాసు స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో గుట్ట చైర్మన్ ఈదులకంటి వెంకట్ రెడ్డి, జిల్లా సందీప్, ఎద్దు హరీష్, బాలకిషన్ గౌడ్, పిన్నింటి నారాయణరెడ్డి, చెరుకురి శ్రీనివాస్ గుర్రపు బాలరాజు, డైరెక్టర్లు చిక్కుడు మల్లేశం, దాచేపల్లి రాజయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్, మండల నాయకులు నీల రమేష్, బద్దిపడగ బాల్రెడ్డి, దయ్యాల మహేష్, రాంబాబు, కొండయ్య ,భాస్కర్, బొట్టు గణపతి, తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!