E-PAPER

గ్రామం మెచ్చిన నాయకుడు.. 25 ఏళ్లుగా ఏకగ్రీవ నాయకత్వం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

గ్రామం మెచ్చిన నాయకుడు.. 25 ఏళ్లుగా ఏకగ్రీవ నాయకత్వం

29 Aug 2026, 10:51 am MANASAKSHIGONTHUKA

గ్రామం మెచ్చిన నాయకుడు..

25 ఏళ్లుగా ఏకగ్రీవ నాయకత్వం

దబ్బకుంటపల్లి కాంగ్రెస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడిగా రొండ్ల శ్రీనివాస్‌రెడ్డికి మరోసారి ఏకగ్రీవ పట్టం

మన సాక్షి గొంతుక | బచ్చన్నపేట:

గ్రామ ప్రజలతో మమేకమై.. పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తూ 25 ఏళ్లుగా ఏకగ్రీవ నాయకుడిగా కొనసాగుతున్న రొండ్ల శ్రీనివాస్‌రెడ్డి మరోసారి దబ్బకుంటపల్లి కాంగ్రెస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

బచ్చన్నపేట మండలం దబ్బకుంటపల్లి గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా రొండ్ల శ్రీనివాస్‌రెడ్డి గత 25 సంవత్సరాలుగా ఏకగ్రీవంగా కొనసాగడం విశేషం. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ, గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు గ్రామంలోని ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి సుఖదుఃఖాల్లో పాలుపంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. పదవికంటే ప్రజల అభిమానం.. రాజకీయాలకంటే సేవే లక్ష్యంగా ఆయన కొనసాగుతున్న నాయకత్వానికి మరోసారి ఏకగ్రీవ ఎన్నిక నిదర్శనంగా నిలిచింది.

ఇటీవల నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ గ్రామ శాఖ నియామకాల్లో రొండ్ల శ్రీనివాస్‌రెడ్డిని మరోసారి గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎండీ మసూద్ పాల్గొని రొండ్ల శ్రీనివాస్‌రెడ్డిని అభినందించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు.

నూతన కమిటీ సభ్యులు

గ్రామ శాఖ ఉపాధ్యక్షులుగా మాడిశెట్టి ఉపేందర్, కర్ణాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మహిపాల్, కోశాధికారిగా కందుల జనార్ధన్, కార్యదర్శులుగా యాదగిరి, వరదారెడ్డి, సిద్ధులు, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఎన్నికయ్యారు.

25 ఏళ్ల ఏకగ్రీవ నాయకత్వం..

ప్రజలతో మమేకమైన సేవా ప్రస్థానం..

దబ్బకుంటపల్లిలో రొండ్ల శ్రీనివాస్‌రెడ్డి నాయకత్వానికి లభిస్తున్న ప్రజాభిమానం, పార్టీ కార్యకర్తల విశ్వాసానికి 25 ఏళ్లుగా కొనసాగుతున్న ఏకగ్రీవ ఎన్నికలే నిదర్శనమని కాంగ్రెస్‌ శ్రేణులు పేర్కొన్నాయి.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దాత్రపు నరేష్, జిల్లా సందీప్, నిడిగొండ శ్రీనివాస్, గుర్రపు బాలరాజు ,చెరుకూరి శ్రీనివాస్, జ్యోతి భాస్కర్,కోక్కలకొండ బాబు, నీలా రమేష్, బొట్టు గణపతి తదితరులు పాల్గొన్నారు

Generating image…

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!