రామలక్ష్మి మృతి తీరని లోటు
రామలక్ష్మి దశదిన కర్మకు హాజరైన విశ్వకర్మ సంఘం నాయకులు
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం విశ్వకర్మ సంఘం బచ్చన్నపేట మండల అధ్యక్షుడు కోడూరి వెంకట్‌చారి వదిన, మాజీ వార్డు మెంబర్‌గా సేవలందించిన కోడూరి రామలక్ష్మి ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, విశ్వకర్మ సంఘం నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించిన ఆమె దశదిన కర్మ కార్యక్రమానికి విశ్వకర్మ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక ప్రముఖులు హాజరై రామలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా బచ్చన్నపేట టౌన్ అధ్యక్షుడు కోడూరి రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు కోడూరి మహాత్మాచారి మాట్లాడుతూ.. కోడూరి రామలక్ష్మి మాజీ వార్డు మెంబర్‌గా ప్రజలకు సేవలందించారని, స్థానికంగా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండేవారని గుర్తుచేశారు. ఆమె ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులతో పాటు సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. రామలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం ప్రధాన కార్యదర్శి కోడూరి వెంకటేష్, గౌరవాధ్యక్షులు సిద్ధులు, వెంకటేశ్వర్లు, కోడూరి బ్రహ్మచారి, అనంతచారి, తంగళ్లపల్లి రమేష్, కోడూరి ఆంజనేయులు, ఉపేందర్, రాంబ్రహ్మం,కోడూరి ప్రశాంత్ మల్లయ్య, తదితరులు పాల్గొని రామలక్ష్మికి నివాళులర్పించారు.
రామలక్ష్మి మృతి పట్ల పలువురు స్థానికులు కూడా సంతాపం వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె అందించిన సేవలను స్మరించుకున్నారు.










